వైఎస్సార్సీపీ నేతలు ఇసుక మాఫియాగా మారి దోపిడీ చేస్తున్నారు: సీపీఎం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 3:40 PM IST

CPM Leader Srinivasa Rao Fire on YSRCP Govt: రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఇసుక మాఫియా (YSRCP Leaders Sand Mining)గా మారి దోపిడీకి పాల్పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విమర్శించారు. గుంటూరులోని సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుకను ఖరీదైన వ్యవహారంగా మార్చారని, కేవలం నగదు మాత్రమే ఇవ్వాలని చెప్పి బ్లాక్ మార్కెట్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎన్జీటి (NGT) ఆదేశాల మేరకు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినా అదంతా తూతూమంత్రంగా జరిగిందన్నారు. 

Drinking Water Problem in AP: గుంటూరు నగరంలో కలుషిత నీరు సరఫరా చేసి ప్రజల ప్రాణాలు మీదకు తెచ్చారని ప్రభుత్వాన్ని విమర్శిచారు. సీపీఎం సీనియర్ నేత బాబూరావు (CPM leader Baburao) మాట్లాడుతూ రాష్ట్రంలో మంచినీరు సరఫరా చేయలేని ప్రభుత్వం మద్యాన్ని(Illegal liquor Mafia Raise in AP) మాత్రం ఏరులు పారిస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీటితో వ్యాపారం చేయటంపై దృష్టి పెట్టి నీటి మీటర్లు పెట్టాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.