వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూలిపోవడం పక్కా: రామకృష్ణ - CPI State Secretary Ramakrishna - CPI STATE SECRETARY RAMAKRISHNA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 3, 2024, 3:30 PM IST
CPI State Secretary Ramakrishna Comments on Election Result : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూలిపోతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ జోస్యం చెప్పారు. రేపు వచ్చే ఎన్నికల ఫలితాల్లో ఇదే స్పష్టమవుతుందని రామకృష్ణ తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపు ఇచ్చామని అదే జరుగుతుందని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రామకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే విజయవాడలో డయేరియా మరణాలు సంభవించాయని రామకృష్ణ విమర్శించారు. డయేరియాతో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. డయేరియాతో చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కలుషిత నీరు తాగి 9 మంది మరణిస్తే వారి మరణానికి తాగునీరు కారణం కాదని వీఎంసీ అధికారులు చెప్పడం అన్యాయమని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రామకృష్ణ అన్నారు.