'జనం కోసం జన ప్రణాళిక'- సీపీఐ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల - CPI released election manifesto - CPI RELEASED ELECTION MANIFESTO
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 5:17 PM IST
CPI Manifesto Released in Vijayawada : జన ప్రణాళిక పేరుతో సీపీఐ మ్యానిఫెస్టో విడుదల చేసింది. జనం కోసం, జనం మధ్యకు జన ప్రణాళిక పేరుతో భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో 2024 ఎన్నికల మేనిఫెస్టోను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలను తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచామని తెలిపారు.
CPI Manifesto : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో 400 లోక్సభ స్థానాల్లో తిరిగి అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో అధికారంలోకి రావటం కోసం నరేంద్ర మోడీ మైండ్ గేమ్ అడుతున్నారని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ, టీడీపీలో ఏ ఒక్కపార్టీకీ ఓటు వేసిన అది బీజేపీకే వేసినట్టు అవుతుందన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో తయారు చేశామని తెలిపారు.