మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన గుత్తేదారులు- లంచం ఇవ్వలేదని బిల్లుల జాప్యం - contractors fired on engineer - CONTRACTORS FIRED ON ENGINEER

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 4, 2024, 12:35 PM IST

Contractor Fired On Engineer Delay Of Bills at Badvel: వైఎస్సార్‌ జిల్లా బద్వేల్ పురపాలిక కార్యాలయంలో ఇంజినీర్‌, గుత్తేదారుల మధ్య  వాగ్వాదం జరిగింది. సీసీ రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసి ఐదు నెలలు దాటినా బిల్లులు చెల్లింపు చేయలేదని ఇంజినీర్‌ను గుత్తేదారులు నిలదీశారు. బిల్లుల కోసం కార్యాలయం చుట్టూ ఎన్ని రోజులు తిప్పుకుంటారని ఇంజినీర్‌తో గుత్తేదారులు వాగ్వాదానికి దిగారు. మార్చి నెలలో బిల్లులు ఎందుకు పాస్‌ చేయలేదని ప్రశ్నించారు. గొడవ జరుగుతున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

Police Advised to Resolve the Issue: అడిగినంత లంచం ఇవ్వలేదని కోటిన్నర రూపాయలు విలువైన పనికి బిల్లు ఆపుతారా అంటూ గుత్తేదారుడు ఇంజినీర్​ను నిలదీశారు. 12 ప్యాకేజీలకు టోకెన్లు కొట్టి ఒక్క 13వ ప్యాకేజీకి ఎందుకు టోకెన్ కొట్టలేదంటూ నిలదీశారు. బిల్లుల జాప్యానికి కారణమైనందుకు మీరే కోటి 24 లక్షలు బిల్లు ఇవ్వాలంటూ గుత్తేదారులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.