చంద్రబాబుతోనే రాష్ట్రం సుభిక్షం: పెన్షనర్ పార్టీ నేతలు - CM Jagan Neglect Pensioners - CM JAGAN NEGLECT PENSIONERS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-04-2024/640-480-21322740-thumbnail-16x9-pensioner-issue.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 26, 2024, 7:10 PM IST
CM Jagan Neglect Pensioners in AP : సీఎం జగన్ పెన్షన్‌దారులను చిన్న చూపు చూశారని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ పార్టీ అధ్యక్షులు సుందర్ రామన్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్‌దారులు నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిల్లో పెన్షన్‌దారులు ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పని చేస్తామని పెన్షనర్స్ నేతలు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వంలో సమయానికి పెన్షన్ అందక, ఈఎంఐలు కట్టలేక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని పెన్షనర్స్ నేతలు పేర్కొన్నారు. పెన్షన్ అందుకునే వ్యక్తికి పెన్షన్ తప్ప మరొక ఆదాయం ఉండదని ఈ సందర్భంగా తెలియజేశారు. పెన్షన్ లబ్ధిదారులకు కనీస గుర్తింపు ఇవ్వని జగన్‌పై తమకు నమ్మకం లేదని ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో జగన్‌ను ఇంటింకి పంపించేందుకు మాతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.