thumbnail

LIVE: విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న చంద్రబాబు- ప్రత్యక్షప్రసారం - White Paper on Power Department

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 3:08 PM IST

Updated : Jul 9, 2024, 4:27 PM IST

CM Chandrababu White Paper on Power Department Live: మారిన అరాచక ప్రభుత్వంతో పాటే పద్ధతులు, విధానాలూ ఒక్కొక్కటిగా మారుతున్నాయి. దోపిడీ రాజ్యానికి చెల్లుచీటి పాడుతూ ప్రజలు, వారి అవసరాల కేంద్రంగా నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి. ఆ సంస్కరణలు, ప్రక్షాళన క్రమంలో ఇప్పుడు విద్యుత్ రంగం వంతు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం.. ఇంధనశాఖపై నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. రాష్ట్ర ఇంధన శాఖ వాస్తవ పరిస్థితి ఏంటి? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంధన శాఖను ఎంతగా నిర్వీర్యం చేసింది? అనే అంశాలను ప్రజల ముందు ఉంచేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విద్యుత్తు రంగ ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది. ఇంధన రంగాన్ని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించనున్నారు. 2019లో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది? అప్పట్లో మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఏ స్థాయికి దిగజార్చింది? వంటి అంశాలను కూడా ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంధనశాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Jul 9, 2024, 4:27 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.