LIVE: అమరావతి రైల్వేలైన్‌కు కేంద్రం ఆమోదం - చంద్రబాబు మీడియా సమావేశం - CHANDRABABU LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 24, 2024, 4:57 PM IST
|Updated : Oct 24, 2024, 5:18 PM IST
LIVE: అమరావతి రైల్వే అనుసంధానం ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 వేల 245 కోట్ల రూపాయలతో 57 కి.మీ అమరావతి రాజధానికి కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాకు నేరుగా అనుసంధానం చేస్తూ కొత్త లైన్ నిర్మాణం జరగనుంది. ఈ లైన్ ద్వారా దక్షిణ భారతాన్ని మద్య, ఉత్తర భారతంతో అనుసంధానం మరింత సులువు కానుంది. అమరలింగేశ్వర స్వామి, అమరావతి స్థూపం, ధ్యానబుద్ద, ఉండవల్లి గుహలకు వెళ్లే వారికి సులువైన మార్గంగా అభివృద్ధి చెందనుంది. అమరావతికి రైల్వేలైన్ మంజూరు కావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.అదే విధంగా దీనిని మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు కూడా అనుసంధానిస్తూ నిర్మించనున్నారు. ఈ లైన్ నిర్మాణం ద్వారా 19 లక్షల పని దినాలు కల్పన జరుగుతుంది. ఈ లైన్ నిర్మాణంతో పాటు 25 లక్షల చెట్లు నాటుతూ కాలుష్య నివారణకు కూడా కేంద్రం చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కృష్ణా నదిపై 3.2 కి.మీ పొడవైన బ్రిడ్జ్‌ని నిర్మించనున్నారు. కొత్తగా రైల్వే లైన్ ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మాణం జరగనుంది. రైల్వే ప్రాజెక్టుల ప్రకటనపై చంద్రబాబు మీడియా సమావేశం
Last Updated : Oct 24, 2024, 5:18 PM IST