LIVE: సీఎం చంద్రబాబు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - CM CHANDRABABU PRESS MEET

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2024, 9:04 PM IST

Updated : Sep 8, 2024, 9:25 PM IST

thumbnail
CM Chandrababu Media Conference Live : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించిన సీఎం, ఆయా జిల్లాల్లో పరిస్థితులు, నమోదైన వర్షపాతం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలు, సన్నద్ధతను కలెక్టర్లు చంద్రబాబుకు వివరించారు. జిల్లాలో నమోదైన వర్షపాతాన్ని అంచనా వేసుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. నేడు, రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపిస్తోందన్నారు.ప్రాణనష్టం లేకుండా చూసుకోవాలి: ఏలేరు రిజర్వాయర్​కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టుల్లోకి వచ్చే ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో బ్యాలెన్స్ చేసుకుని సమర్థవంతంగా ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టాలన్నారు. కాలువలు, చెరువులు, డ్రెయిన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. భారీ, అతిభారీ వర్షాలు ఉండే ప్రాంతంలో తాగునీరు, ఆహారం, మెడికల్ క్యాంప్​లకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణనష్టం లేకుండా చూసుకోవాలన్నారు. పంట నష్టం అంచనా, బాధితులకు ఆహారం సరఫరా, వరద పరిస్థితులను గమనించేందుకు డ్రోన్లు వినియోగించాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు.  
Last Updated : Sep 8, 2024, 9:25 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.