LIVE: స్వాతంత్య్ర వేడుకలు - జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు - cm at independence day celebrations
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 15, 2024, 9:00 AM IST
|Updated : Aug 15, 2024, 10:57 AM IST
CM Chandrababu at Independence Day Celebrations: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. గ్రామాల్లో పంద్రాగస్టు వేడుకలు నాటి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తికి అద్దం పట్టేలా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. స్వాతంత్య్ర వేడుకలలో భాగంగా నేడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పతాక ఆవిష్కరణకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహోజ్వల చరిత గల మన దేశ సమగ్రత కాపాడడం మనందరి కర్తవ్యమని ఆయన అన్నారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు వరుసగా మూడో సంవత్సరం 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామన్నారు. మన తెలుగు వాడైన పింగళి వెంకయ్య రూపొందించిన మువ్వన్నెల జాతీయ జెండా ప్రతి ఇంటిపై ఎగరడం మనకు మరింత ప్రత్యేకం, గర్వకారణమని కొనియాడారు. ప్రతి ఇంటిపై, ప్రతి కార్యాలయంపై మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని కోరారు. ప్రస్తుతం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Aug 15, 2024, 10:57 AM IST