LIVE: గుడివాడలో అన్న క్యాంటీన్ పునఃప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - CM Chandrababu Anna canteen Launch - CM CHANDRABABU ANNA CANTEEN LAUNCH
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 15, 2024, 12:52 PM IST
|Updated : Aug 15, 2024, 2:17 PM IST
CM Chandrababu Anna Canteen Inauguration: మూడు పూటలా పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు లాంఛనంగా పునఃప్రారంభించారు. కృష్ణా జిల్లా గుడివాడలో మొదటి అన్న క్యాంటీన్‌ను పునఃప్రారంభించారు. అనంతరం పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. ఆ తర్వాత ప్రజలతో ఇంటరాక్షన్ కానున్నారు. అదే విధంగా మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభిస్తారు. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి. 203 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించినా భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. రెండు, మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా తొలిదశలో 100 అన్నక్యాంటీన్లు ప్రారంభిస్తునారు. వీటి ద్వారా పేదలకు పూటకు రూ.5 నామమాత్రపు ధరకు ఆహారం లభించనుంది. అన్న క్యాంటీన్లలో రోజుకి ఒకరికి ఆహారం అందించడానికి రూ.90 ఖర్చు అవుతుంది. రూ.15 వినియోగదారుడు చెల్లిస్తే రూ.75 ప్రభుత్వం భరించనుంది. అన్నక్యాంటీన్ల ద్వారా ప్రతి రోజూ 1.05 లక్షల మంది పేదలకు ఆహారం సరఫరా చేస్తారు. అన్నక్యాంటీన్‌లో ఉ.7.30 నుంచి 10 వరకు అల్పాహారం, మ.12 నుంచి 3 వరకు మధ్యాహ్న భోజనం, రాత్రి 7.30 నుంచి 9 వరకు రాత్రి భోజనం ఉండనుంది. ఆదివారం అన్న క్యాంటీన్లకు సెలవు. ప్రస్తుతం కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు అన్నక్యాంటీన్ ప్రారంభించారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Aug 15, 2024, 2:17 PM IST