ఫేక్ న్యూస్,ఫేక్ రాజకీయాల ఉచ్చులో పడి మోసపోవద్దు: సీఎం చంద్రబాబు - CM Chandrababu Serious on Fake News - CM CHANDRABABU SERIOUS ON FAKE NEWS
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 5, 2024, 7:34 AM IST
CM Chandrababu Serious on Fake News on Sakshi Paper : ఫేక్ న్యూస్, ఫేక్‌గాళ్లను నమొద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సూచించారు. ఫేక్ రాజకీయాల ఉచ్చులో పడి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. 'బాపట్లలో తెలుగుదేశం బరితెగింపు' శీర్షికతో భట్టిప్రోలు ఎస్సై చొక్కాను టీడీపీ కార్యకర్త పట్టుకున్నారంటూ సాక్షి పత్రికలో వచ్చిన కథనం ఫేక్ అని ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణను పోలీసులు నిలువరిస్తున్న వీడియోను పోస్టుకు జత చేశారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఫేక్ పనులు చేస్తుంటే ఆయన క్విడ్ ప్రోకో విష పత్రిక సాక్షి తప్పుడు రాతలు రాస్తోందంటూ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. మార్ఫింగ్ ఫొటోతో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులపై ఎటువంటి దాడి జరగలేదని పేర్కొన్నారు. శాంతిభద్రతలు కాపాడుతున్న వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా తప్పుడు రాతలు రాస్తే సాక్షిపై చర్యలు తప్పవు అని లోకేశ్ హెచ్చరించారు.