LIVE: విశాఖ గీతం యూనివర్సిటీలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ - ప్రత్యక్ష ప్రసారం - Citizens for Democracy Live
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2024, 11:25 AM IST
|Updated : Feb 25, 2024, 12:17 PM IST
Citizens for Democracy Live : 'ఓటు వేద్దాం - ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం' అనే ప్రచార నినాదంతో నేటి నుంచి రాష్ట్ర స్థాయి కళాజాత నిర్వహిస్తున్నట్లు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (Citizens for Democracy) సంయుక్త కార్యదర్శి వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి, విజయవాడ నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్ చెప్పారు. ఓటు ప్రాధాన్యత తెలుపుతూ నృత్య నాటికలు, గజల్స్, గేయాలు, జానపదాలతో కూడిన కళారూపాలను ప్రదర్శిస్తూ, ఓటర్లను జాగృత పరుస్తామని తెలిపారు.Kalajatha Programme By Citizens for Democracy : ఎన్నికల్లో ధన ప్రభావం, మద్యం పంపిణీ లాంటి ప్రలోభాలను తగ్గించడానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర స్థాయి కళాజాతను విశాఖపట్నం నుండి ప్రారంభించారు. మార్చి 8న కర్నూలులో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఓటు ప్రాధాన్యతను తెలుపుతూ ప్రజల్లో ఓటు హక్కు సద్వినియోగంపై అవగాహన కలిగించడమే తమ ప్రధాన లక్ష్యమని కళాజాత నిర్వాహకులు తెలిపారు.ప్రస్తుతం విశాఖ గీతం యూనివర్సిటీలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో 'ఓటు వేద్దాం - ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం' కార్యక్రమం జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం మీ కోసం
Last Updated : Feb 25, 2024, 12:17 PM IST