దర్శి ఇన్ఛార్జ్, సిట్టింగ్ ఎమ్మెల్యే మధ్య విభేదాలు - బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు - prakasam district politices
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 10:33 PM IST
Chevireddy Bhaskar Reddy and Balineni Meeting in Prakasam District : వచ్చే ఎన్నికల్లో దర్శిలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో పార్టీ నూతన కార్యాలయాన్ని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో శివప్రసాద్‌రెడ్డి తండ్రి ఆనారోగ్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు దర్శి వైసీపీలో ఉన్న విభేదాలను పక్కన పెట్టాలని సూచించారు.
అయితే దర్శి ఇంఛార్జి బూచేపల్లి ప్రసాద్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో బాలినేని ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకుని అందరు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని నేతలందరూ సమన్వయంతో కలిసి పని చేసి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాలని బాలినేని సూచించారు. అధిష్టానం ఆదేశాల మేరకు శివప్రసాద్‌రెడ్డిని అత్యధిక మోజరిటితో గెలుపొందేలా వైసీపీ నాయకులు కృషి చేయాలని కోరారు.