LIVE: పొన్నూరులో చంద్రబాబు 'రా కదలిరా' బహిరంగ సభ - ప్రత్యక్ష ప్రసారం - పొన్నూరులో చంద్రబాబు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-01-2024/640-480-20617229-thumbnail-16x9-live.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 29, 2024, 3:38 PM IST
|Updated : Jan 29, 2024, 6:06 PM IST
Chandrababu Raa Kadali Ra Program Live in Ponnuru : తెలుగుదేశం "రా కదలి రా" బహిరంగ సభకు రాజమహేంద్రవరం, పొన్నూరులో భారీ ఏర్పాట్లు చేశారు. మొదటగా రాజమహేంద్రవరం పరిధి కాతేరులో 'రా కదలిరా' సభలో టీడీపీ అధినేత పాల్లోని ప్రసంగించారు. ప్రస్తుతం పొన్నూరు నియోజకవర్గం నారా కోడూరు సమీపంలోని వడ్లమూడి క్వారీ సెంటర్ వద్ద సువిశాల ప్రదేశంలో బహిరంగ సభ జరుగుతుంది. చంద్రబాబు పాల్గొని మాట్లాడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ముంగిట జరిగే ఈ బహిరంగ సభకు సమీప నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివస్తారనే అంచనాలతో ఏర్పాటు చేశారు.
పార్టీ అధినేత చంద్రబాబు హాజరుకానుండటంతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సుమారు 2 లక్షల మంది సభకు వస్తారని, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. వైఎస్సార్సీపీ అరాచక పాలన అంతమే లక్ష్యంగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఏర్పాటు చేసిన సభలో అందరూ పాల్గొనాలని నేతలు పిలుపునిచ్చారు. పొన్నూరు నియోజకవర్గం నారా కోడూరు సమీపంలో 'రా కదలిరా' సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం.