LIVE: కర్నూలు జిల్లా ఆలూరు చంద్రబాబు బహిరంగసభ- ప్రత్యక్షప్రసారం - Chandrababu Prajagalam - CHANDRABABU PRAJAGALAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 19, 2024, 4:49 PM IST
|Updated : Apr 19, 2024, 5:53 PM IST
Chandrababu Prajagalam: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలు జోరుగా సాగుతున్నాయి. నేడు ఆలూరు, రాయదుర్గం నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం సభలు ఉన్నాయి. రేపు గూడూరు, సర్వేపల్లి, సత్యవేడులో చంద్రబాబు పర్యటన ఉంది. మరోవైపు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో కూటమి ప్రచార వేగం మరింత పెంచింది. ఇప్పటికే ఆరు నియోజకవర్గాల్లో ప్రజాగళం - వారాహి విజయోత్సవ సభలు విజయవంతంగా నిర్వహించిన చంద్రబాబు - పవన్ కల్యాణ్ లకు తోడుగా ప్రధాని నరేంద్ర మోదీ ఇతర బీజేపీ జాతీయ నేతలు జతకట్టనున్నారు. నాలుగు బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేటల్లో ఒకటి, మరోచోట బహిరంగ సభల్లో ప్రధాని మోదీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి పాల్గొనేలా కూటమి ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈలోగా చంద్రబాబు - పవన్ కల్యాణ్ వీలైనన్ని ఎక్కువ సభల్లో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆలూరు చంద్రబాబు బహిరంగసభలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Apr 19, 2024, 5:53 PM IST