'ఐదేళ్లలో ఇసుక, మద్యం, భూ కుంభకోణాలు తప్ప మంత్రి పెద్దిరెడ్డి చేసిందేమీ లేదు' - Challa Ramachandra Reddy Exclusive - CHALLA RAMACHANDRA REDDY EXCLUSIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-05-2024/640-480-21398014-thumbnail-16x9-challa-ramachandra-reddy-exclusive-interview.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2024, 1:20 PM IST
Challa Ramachandra Reddy Exclusive Interview : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు, దౌర్జన్యాలతో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం అట్టడుగు స్థానంలోకి వెళ్లిందని తెలుగుదేశం అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. కూటమి నేతలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఇసుక, మద్యం, భూ కుంభకోణాలు తప్ప 5 ఏళ్లలో మంత్రి పెద్దిరెడ్డి చేసిందేమీ లేదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో కొంచెం కూడా అభివృద్ది జరగలేదని, ఐదేళ్ల జగన్ హయాంలో ఏ ఒక్క వర్గం వారు కూడా లబ్ది పొందలేకపోగా దగా పడ్డారని మండిపడ్డారు.
ప్రజలు ఎన్డీఏ కూటమికి బ్రహ్మరథం పడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. జరగబోయే ఎన్నికల్లో కూటమి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీని ఓడించి ప్రజలు తమ కష్టాలకు ముగింపు పలకడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల్లో పెద్దిరెడ్డిని ఓడించి ఇంటికి పంపిస్తామంటున్న చల్లా రామచంద్రారెడ్డితో ఈ టీవీ భారత్ ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి.