2024 సార్వత్రిక ఎన్నికల్లో 83 శాతంపైగా పోలింగ్ నమోదే లక్ష్యం: సీఈఓ - Chief Electoral Officer of AP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 9:34 PM IST
CEO Mukesh Kumar Meena on General Elections: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో 82 శాతానికి పైగా పోలింగ్ నమోదుకావాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఓటరు చైతన్యం, ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తున్నట్టు సీఈఓ స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘానికి చెందిన స్వీప్ అధికారుల బృందంతో సీఈఓ బేటీ అయ్యారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 79.77% పోలింగ్ నమోదైందని జాతీయ స్థాయిలో 69% పోలింగ్ నమోదు అయినట్లు వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 83% పైగా పోలింగ్ నమోదు అయ్యే లక్ష్యంతో స్వీప్ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో అమలు చేస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలోని ఓటర్లందరికీ ఎన్నికల ప్రక్రియపై సమగ్రమైన అవగాహన కల్పించి వారంతా పోలింగ్లో భాగస్వామ్యులయ్యేలా కార్యాచరణ చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ స్వీప్ కార్యక్రమాలను ప్రణాళికా బద్దంగా అమలు చేస్తున్నట్టు వివరించారు. సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అమలుపై నోడల్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు.