కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్‌పై సర్వత్రా హర్షాతిరేకాలు - కోడికత్తి శ్రీను
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 7:02 PM IST
Celebrations on Kodikatthi Case Accused Srinivas Bail : కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ రావడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బెయిల్ రావడాన్ని హర్షిస్తూ దళితులు, దళిత సంఘాల నేతలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కోడి కత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాస్‌కు బెయిల్ రావడంతో విశాఖలో దళిత సంఘాల హర్షం వ్యక్తం చేశాయి. నేరుగా విశాఖ కేంద్ర కారాగారం వద్దకు వెళ్లి జనుపల్లి శ్రీనివాస్‌కు విశాఖ దళిత ఐక్య వేదిక సభ్యులు బెయిల్ విషయం తెలియజేశారు. ఈ విషయం తెలుసుకుని జనుపల్లి శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేశాడు. విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకటరావు బెయిల్ ఇచ్చిన న్యాయ స్థానానికి, న్యాయ మూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. జనుపల్లి శ్రీనివాస్ ను కలుసుకోవడానికి జైల్ దగ్గరకు, ఇతర ప్రాంతాలకు రావద్దని, బెయిల్ వార్త తెలుసుకుని హర్షం వ్యక్తం చేసిన దళిత సంఘాలకు, రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.