విశాఖలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య - కారణం తెలిస్తే షాక్ - Young Man Murdered - YOUNG MAN MURDERED
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 9, 2024, 10:43 AM IST
Cab Driver Murdered in Visakha : విశాఖ నగర పరిధిలోని అగనంపూడి సమీపంలో ఓ క్యాబ్ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. మల్కాపురం ప్రకాష్ నగర్‌కు చెందిన దాడి సూర్యకిరణ్‌ను (25) నిందితుడు దారుణంగా కత్తితో పొడిచాడు. రెండేళ్ల క్రితం గాజువాక దరి శ్రీనగర్‌కు చెందిన పసుపులేటి మేఘనను సూర్యకిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 1న ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తన భార్యను, బిడ్డను చూసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
ఈ నేపథ్యంలో తన కుమార్తె, మనమరాలిని చూడడానికి మేఘన తల్లి సుజాత ఆసుపత్రికి వచ్చింది. తన అత్త ఎజ్జల కొర్లయ్య అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందన్న కారణంతో సూర్యకిరణ్ ఆమెను అడ్డుకుని గొడవ పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె కొర్లయ్యకు చెప్పింది. ఆసుపత్రి నుంచి బైక్‌పై ఇంటికి వెళుతున్న సూర్యకిరణ్‌పై కొర్లయ్య మాటువేసి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో సూర్యకిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. స్థానికుల సమాచారం మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.