వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన వారు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు- వారిని చేర్చుకోము : ఆదినారాయణరెడ్డి - MLA Adinarayana Reddy Fire on Jagan - MLA ADINARAYANA REDDY FIRE ON JAGAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 10, 2024, 10:57 PM IST
BJP MLA Adinarayana Reddy Fire on Jagan: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పతనానికి అమరావతి నాంది పలికిందని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులను కలిసిన ఆయన జగన్ తీరుపై మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా ఓ వ్యాపారవేత్తలా ప్రవర్తించడం వల్లే ప్రజలు ఓడించారన్నారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరేందుకు వస్తున్నారని, అయితే వారిని చేర్చుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఐదేళ్లు అరాచకాలకు పాల్పడ్డ వైఎస్సార్సీపీ నాయకులపై చట్టపరంగా చర్యలు ఉంటాయని ఆదినారాయణరెడ్డి చెప్పారు.
"రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పతనానికి అమరావతి నాంది పలికింది. జగన్ మోహన్ రెడ్డి సీఎంలా కాకుండా వ్యాపారవేత్తలా ప్రవర్తించారు. అందువల్లే ప్రజలు జగన్‌ను ఓడించారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరేందుకు వస్తున్నారని, అయితే వారిని చేర్చుకునే అవకాశం లేదు. అరాచకాలకు పాల్పడ్డ వైఎస్సార్సీపీ నాయకులపై చట్టపరంగా చర్యలు ఉంటాయి." - ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే