తులసి వనంలాంటి తిరుపతిని వైఎస్సార్సీపీ గంజాయి వనంగా మార్చేసింది: భానుప్రకాష్​ - BJP leaders complain to SP - BJP LEADERS COMPLAIN TO SP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2024, 3:02 PM IST

Ganja Transport in Tirupati: తులసి వనంలాంటి తిరుపతిని వైఎస్సార్సీపీ నేతలు గంజాయి వనంగా మార్చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ ఆరోపించారు.గంజాయి అక్రమ రవాణా లేకుండా చేయాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‍ రాజుకు వినతిపత్రం అందజేశారు. ఉన్నతాధికారులకు వివరించినా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు గంజాయి అక్రమరవాణాలో భాగస్వామ్యం ఉండటంతో చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన అల్లర్లలో యువత గంజాయి మత్తులో దాడికి పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయని ఎస్పీకి వివరించారు. 

తిరుపతిని గంజాయికి నిలయంగా మార్చేశారన్నారు. దేశంలో గంజాయి ఎక్కువగా స్మగ్లింగ్‍ జరుగుతున్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్‍ అని నార్కోటిక్‍ బ్యూరో ఆఫ్‍ ఇండియా తెలిపిందని గుర్తు చేశారు. మద్యంతో పాటు గంజాయి వల్ల యువత సహనం కోల్పోయి భాద్యతారాహిత్యంగా తయారవుతున్నారని ఆయన తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం  గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. యువత గంజాయికి అలావాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని భాను ప్రకాష్ సూచించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.