ధరలు పెంచి, పన్నులు వేసి జగన్ పాలన చేశారు: పురందేశ్వరి - BJP leader Purandeswari
🎬 Watch Now: Feature Video
Purandeswari election campaign: అరాచక పాలనను అంతమొందించేదుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాజమహేంద్రవరం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి పురందేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో, పురందేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వాహించారు. స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు. ధరల పెంపు, పన్నుల బాదుడుతో వైసీపీ ప్రభుత్వం ప్రజల నడ్డివిరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఉద్యోగ అవకాశాలు రావాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరముందన్నారు. భవిష్యత్ తరాల కోసం కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు.
వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు విధ్వంసానికి తెరతీసిందని పురందేశ్వరి ఆరోపించారు. అందులో భాగంగా మెుదట ప్రజా వేదిక కూల్చివేశారని గుర్తుచేశారు. పరిపాలన అనుభవం కలిగిన చంద్రబాబును అధికారంలోకి తీసుకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అందులో భాగంగా కూటమి నేతలను ప్రజలు గెలిపించడానికి సిద్ధమయ్యారని వెల్లడించారు. గోదావరి ప్రక్షాళన కోసం కేంద్రం నిధులు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో బ్లెడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ కారణంగా రాత్రి 7 గంటలకే బయట తిరగలేని పరిస్థితి ఏర్పడిందని పురందేశ్వరి దుయ్యబట్టారు.