LIVE: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మీడియా సమావేశం- ప్రత్యక్ష ప్రసారం - BJP Chief Purandeshwari Press Meet
🎬 Watch Now: Feature Video
BJP Chief Purandeshwari Press Meet Live: విజయవాడ రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భాజపా ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో 11 మంది ప్రతినిధులు గవర్నర్‌ను కలిశారు. 13 అంశాలతో రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై వివరాలు ప్రకటించాలని గవర్నర్‌ను పురందేశ్వరి కోరారు. ఆర్‌బీఐ జాబితా ప్రకారం తెచ్చిన మొత్తం అప్పుల వివరాలు ప్రకటించాలని, కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు, గుత్తేదారులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలకై లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు తాకట్టుపెట్టి తెచ్చిన రుణాల మొత్తం? ఎంత అని అడిగారు. సావనీర్ గ్యారంటీ ఇచ్చి తెచ్చిన రుణాల మొత్తం ఎంతో? వెల్లడించాలని కోరారు. ఎన్నికల అనంతరం గుత్తేదారులకు చెల్లించిన మొత్తాల వివరాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ నుంచి, ఆర్ధిక సంస్థల నుంచి తెప్పిన అప్పులు? ప్రభుత్వ ఉద్యోగులకు టీఏ, డీఏ బకాయిలు ఎంత? ఏటా తిరిగి చెల్లించాల్సిన అసలు, వడ్డీ ఎంతెంత? పౌరసరఫరాల కార్పొరేషన్, డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలు ఎంత? సంక్షేమ పథకాలకు నిధులు విడుదలో స్వల్ప మొత్తాలే ఇచ్చారన్నారు. బటన్ నొక్కిన వాటికి కూడా పాక్షికంగా చెల్లింపులు జరిపారన్నారు. ఈ ఏడాది సంక్షేమ పథకాలకు ఇంకా ఎంత నిధులు చెల్లించాలి? రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న కేసులు ఎన్ని? కోర్టులు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయకుండా కంటెంప్ట్ కేసులు ఎన్ని? ఈ వివరాలు సీఎస్ ద్వారా తెప్పించాలని గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో పురందేశ్వరి కోరారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం గవర్నర్ బంగ్లా వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న పురందేశ్వరి ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : May 31, 2024, 5:47 PM IST