అనంతలో పట్టపగలు రెచ్చిపోతున్న దొంగలు- గంటల వ్యవధిలో పార్కింగ్ చేసిన బైక్‌లు చోరీ - TWO WHEELER THIEVES - TWO WHEELER THIEVES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 30, 2024, 12:18 PM IST
Two Wheeler Thieves Halchal in Anantapur District : అనంతపురం నగరంలో ద్విచక్ర వాహన దొంగలు హల్చల్ చేస్తున్నారు. పార్కింగ్ చేసిన బైకులను గంటల వ్యవధిలోనే అపహరిస్తూ బాధితులకు చుక్కలు చూపిస్తున్నారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద రెండు రోజుల కిందట బుల్లెట్ వాహనాన్ని ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లారు. ఆ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
రెండు రోజుల క్రితం నార్పల మండలం బండ్ల పప్పూరుకి చెందిన జయప్రకాష్ ఆసుపత్రిలో తన బంధువును పరామర్శించడానికి వెళ్లి వచ్చేసరికి దొంగలు తన వాహనాన్ని ఎత్తుకు వెళ్లారు. సీసీ టీవీ ఫుటేజీని ఆధారంగా ఇద్దరు వ్యక్తులు తన వాహనాన్ని దొంగిలించారని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా అక్కడ పోలీసులు సరిగా స్పందించలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నా పోలీసులు దొంగలను పట్టుకునే ప్రయత్నం చేయడం లేదని బాధితులు వాపోతున్నారు. పోలీసులు ఇప్పటికైనా ప్రత్యేక చొరవ తీసుకొని బైక్ దొంగలను పట్టుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.