కాకినాడ మత్స్యకారులకు చిక్కిన బాహుబలి చేప - Fishermen Caught Big Fish

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 19, 2024, 9:47 AM IST

thumbnail
అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌కు బాహుబలి చేప (ETV Bharat)

Big Fish Caught by Fishermen at Antarvedi Mini Fishing Harbour : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్​కు భారీ టేకు చేప వచ్చింది. అంతర్వేది సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన కాకినాడకు చెందిన మత్స్యకారుల వలకు భారీ టేకు చేప చిక్కింది. బాహుబలి చేపను అతి కష్టం మీద హార్బర్​కు తీసుకొచ్చారు. తాళ్ల సాయంతో చేపను నీటిలో నుంచి పైకి లేపడానికి 30 మంది మత్స్యకారులు ప్రయత్నించారు. అయినా అది పైకి రాకపోవడంతో జేసీబీని తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు.

భారీ టేకు చేపకు బేరం కుదరకపోవడంతో కాకినాడ కుంభాభిషేకం రేవుకు తరలించారు. చేపపై ఉండే శంకులను ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తారని, వాటితో అలంకరణ వస్తువులు తయారు చేస్తారని మత్స్యకారులు తెలిపారు. ఇది సొర చేప జాతికి చెందిందని రాజోలు మత్స్యశాఖ ఏడీ హర్షవర్దన్ తెలిపారు. ఈ భారీ టేకు చేప అచ్చం చూడటానికి విమానం ఆకారంలో ఉండటం ఆసక్తి రేపుతోంది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.