ఆలయ హుండీ లెక్కింపులో చేతివాటం - బంగారం చోరీ చేసిన బ్యాంకు ఉద్యోగి - GOLD Theft in Kanipakam temple - GOLD THEFT IN KANIPAKAM TEMPLE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 8:22 PM IST

Bank Employee Theft in Hundi Counting of Kanipakam Temple : ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారి హుండీ లెక్కింపులో బ్యాంకు ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. స్వామివారికి భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి, ఇతర కానుకలను ఆలయ ఆస్థాన మండపంలో ఈరోజు లెక్కింపు చేపట్టారు. అనంతరం వచ్చిన ఆదాయాన్ని బ్యాంకు అధికారులకు జమ చేస్తారు. అయితే బంగారు నగలు తనిఖీ చేసే అధికారి ప్రకాశ్ స్ధానిక బ్యాంకు సిబ్బందితో కలసి ఈరోజు హుండీ లెక్కింపునకు వచ్చారు. లెక్కింపు సమయంలో 100 గ్రాముల బంగారు బిస్కెట్, 1.5 గ్రాముల బంగారు ఉంగరంతో పాటు 500 రూపాయల నోటు దొంగలించి పక్కనే ఉన్న బ్యాంకు సంచిలో ప్రకాశ్ దాచుకున్నారు. 

ఆలయ సీసీ కెమెరాల కంట్రోల్ గదిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది బ్యాంకు ఉద్యోగి చేతివాటాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. పోలీసులు, ఆలయ భద్రతా సిబ్బంది తనిఖీలు చేయడంతో అప్రైజర్ బ్యాంకు సంచిలో దాచి ఉన్న బంగారం, నగదును గుర్తించారు. బ్యాంకు అప్రైజర్ ప్రకాశ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతంరం ఆయనపై కేసు నమోదు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.