శిథిలావస్థకు చేరిన బద్వేల్ బస్టాండ్ - ప్రజల ప్రాణాలతో ఆర్టీసీ చెలగాటం - Dilapidated RTC bus Stand - DILAPIDATED RTC BUS STAND
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 3, 2024, 4:52 PM IST
Badvel RTC Bus Stand in Dilapidated Condition: సురిక్షిత ప్రయాణమని గొప్పలు చెప్పే ఆర్టీసీ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. అందుకు సీఎం జగన్ ఇలాకాలో ఉన్న వైఎస్సార్ జిల్లా బద్వేల్ బస్టాండ్ పరిస్థితే నిదర్శనం. బద్వేల్ బస్టాండ్ శిథిలావస్థకు చేరింది. పైకప్పు పెచ్చులు ఊడి పడడంతో ప్రయాణికులు తీవ్ర గాయాలపాలవుతున్నారు. ఇటీవల గోపవరం మండలం రాచాయిపేటకు చెందిన శేషమ్మ అనే మహిళపై పైపెచ్చు ఊడి తలపై పడడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.
తరచూ పెచ్చులూడి పడుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బస్టాండ్ పైకప్పు తొలిగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ప్రాంగణంలో పగలగొట్టిన వ్యర్థాలను తొలగించకపోవడంతో ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్లో మరమ్మతుల కారణంగా ఎండకు, వానకు తడుస్తూ బయటే కూర్చోవాల్సిన దుస్థితి వచ్చిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.