క్యాట్‌లో అదనపు డీజీ కేసు విచారణ - ఒకే కారణంతో రెండుసార్లు సస్పెండ్ చేశారన్న న్యాయవాది - Additional DG Petition - ADDITIONAL DG PETITION

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 7:04 PM IST

Arguments in CAT on Additional DG AB Venkateshwar Rao Petition: అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావు పిటీషన్‌పై కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌లో వాదనలు ముగిశాయి. ఫోన్ టాపింగ్ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని, అభియోగపత్రం దాఖలు చేసి వాదనలు ముగిసే వరకు నిందితుడిని సస్పెన్షన్‌లో ఉంచే అధికారం ప్రభుత్వానికి ఉందని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌ క్యాట్‌ (Central Administrative Tribunal)కు తెలిపారు. నిందితుడు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నాడనే సస్పెన్షన్ విధించినట్లు ఆయన వివరించారు. 

గత వారం క్యాట్‌లో ఏబీ వెంకటేశ్వర రావు తరపు న్యాయవాది ఆదినారాయణ వాదనలు వినిపించారు. ఒకే కారణంతో ఏబీ వెంకటేశ్వర రావును రెండు సార్లు సస్పెండ్ చేశారని సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన క్యాట్‌కు తెలిపారు. తనను సస్పెండ్ చేయడాన్ని అదనపు డీజీ వెంకటేశ్వర రావు క్యాట్‌లో సవాల్ చేశారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ తీర్పును వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.