జీవీఎంసీ సమావేశంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ నోటిదురుసు - తోపులాట - Argument in GVMC Meeting - ARGUMENT IN GVMC MEETING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 25, 2024, 3:59 PM IST
Argument Between YSRCP and Alliance Leaders in GVMC Meeting : విశాఖ మహానగర పాలక సంస్థ (Greater Visakha Municipal Corporation) కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బాణాల శ్రీనివాస్ నోటి దురుసు తోపులాటకు దారి తీసింది. వైఎస్సార్సీపీ నేతలు, కూటమి నేతలు ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు వెళ్లారు. సమావేశంలో మాట్లాడుతున్న జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్‌ను వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బాణాల శ్రీనివాస్ క్రిమినల్ అంటూ దూషించారు. దీంతో బాణాలు శ్రీనివాస్ మూర్తియాదవ్కు క్షమాపణ చెప్పాలని కూటమి కార్పొరేట్లరు పట్టు బట్టారు. మేయర్ పోడియంను కూటమి కార్పొరేటర్లు చుట్టుముట్టారు. మూర్తి యాదవ్ని క్రిమినల్ అని సంభోదించినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని పొడియం దగ్గరే బైఠాయించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు జైన్, పీవీ సురేష్, కూటమి కార్పొరేటర్లు మూర్తి యాదవ్, బొమ్మిడి రమణ, లేళ్ల కొటేశ్వరరావు మధ్య తోపులాట జరిగింది.