27న ప్రభుత్వ ఉద్యోగుల 'చలో విజయవాడ' - పోస్టర్ విడుదల - ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్స్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 8:07 AM IST
APJAC February 27th Chalo Vijayawada Program : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డు మీదకి రావడానికి ప్రభుత్వం చేసిన తప్పిదమే కారణమే తప్ప ఉద్యోగులు చేసిన తప్పిదం కాదంటూ ఏపీజేఏసీ (APJAC) నాయకులు స్పష్టం చేశారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా తమ బకాయి డబ్బులను ఇవ్వాలని, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గత్యంతరం లేక ఉద్యోగులమంతా నిరసన కార్యక్రమాలు చేపట్టారని వారు అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఈ నెల 27న చేపట్టనున్న 'చలో విజయవాడ (Chalo Vijayawada)' కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను వారు ఆవిష్కరించారు.
ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం : పీఆర్సీ అమలు, పాత పెన్షన్ పునరుద్ధరణ, బకాయిల చెల్లింపులు వంటి ప్రధాన సమస్యలను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో చర్చించినా ఎటువంటి పరిష్కారం లభించకపోవడంతోనే చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నామని ఏపీజేఏసీ నేతలు స్పష్టం చేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.