రాష్ట్రంలో రెండు కార్పొరేట్ శక్తులను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది : మాణిక్కం ఠాకూర్ - Manikkam Thakur on Elections - MANIKKAM THAKUR ON ELECTIONS
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 2, 2024, 4:59 PM IST
APCC Incharge Manikkam Thakur on AP Elections: త్వరలో రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొంటారని ఏపీసీసీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ తెలిపారు. రేపటికల్లా రాహుల్ షెడ్యూల్ ఖరారు అవుతుందని వివరించారు. ఏపీలో ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, రెండు కార్పొరేట్ శక్తులను ఎదుర్కోబోతున్నామన్నారు. ఎన్నికల్లో డబ్బుల ప్రభావం కనపడుతోందని ఠాకూర్ ఆరోపించారు. ప్రత్యేక హోదాపై వైసీపీ, తెలుగదేశం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై ఆ రెండు పార్టీలు మేనిఫెస్టోలో కూడా పెట్టలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.
రాష్ట్రంలో పేదరికం నిర్మూలించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కావడంతో అక్కడ ఎక్కువ దృష్టి పెడుతున్నామన్నారు. పార్టీలో సీటు రానివారు అసంతృప్తికి లోను కావద్దని హితవుపలికారు. అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునించారు. అలానే మాణిక్కం ఠాకూర్ బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులను కలిశారు. వారితో పాటు వామపక్షాల నేతలు కూడా న్యాయవాదులతో సమావేశమయ్యారు.