'మేనిఫేస్టోలో సర్పంచ్ల సమస్యలు పరిష్కరిస్తామని ఉంటేనే ఓటేస్తాం' - Panchayat Raj Chamber President YVB - PANCHAYAT RAJ CHAMBER PRESIDENT YVB
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 20, 2024, 5:40 PM IST
AP Panchayat Raj Chamber President YVB Rajendra Prasad on Elections : రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా సర్పంచ్‌లు పని చేస్తారని ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి అటూ సర్పంచ్‌లను ఇటూ ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. సర్పంచ్ల సమస్యలు పరిష్కరిస్తామని ఏ పార్టీ అయితే మేనిఫేస్టోలో పెడుతుందో వారికే సర్పంచ్ల పూర్తి మద్దతు ఉంటుందని పెర్కొన్నారు.
గ్రామీణ ప్రాంత సమస్యలు పరిష్కరించాలని మూడేళ్లుగా ఆందోళనలు చేస్తున్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. ఐదేళ్లుగా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమవుతున్నా అధికార వైఎస్సార్సీపీ పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. గ్రామ పంచాయతీల సమస్యలు పట్టించుకోని జగన్ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సీఎం జగన్ సర్పంచ్‌లపై కపట ప్రేమ చూపిస్తున్నారని అంటున్న రాజేంద్ర ప్రసాద్‌తో ఈటీవీ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి