భీమిలి బీచ్‌ సమీపంలో శాశ్వత కాంక్రీట్‌ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం - AP Latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 9:40 AM IST

AP High Court on Constructions at Bhimili Beach: విశాఖ జిల్లా భీమిలి బీచ్‌ సమీపంలో శాశ్వత కాంక్రీట్‌ నిర్మాణాలు చేపట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి నిర్మాణాలకు ఏవిధంగా అనుమతులిచ్చారని అధికారులను ప్రశ్నించింది. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌పరిధిలో నిర్మాణాలు చేపట్టడం ఏంటని నిలదీసింది. అక్కడున్న యంత్ర సామగ్రిని తక్షణమే సీజ్‌ చేసి, నిర్మాణ పనులను నిలిపేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని స్పష్టంచేసింది. 

తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సీఆర్‌జడ్‌ నిబంధనల(CRZ Rules) కు విరుద్ధంగా, ఇసుక తిన్నెలను తొలగించి బీచ్‌ వద్ద శాశ్వత నిర్మాణాలు చేస్తున్నారని జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి చర్యలకు ఆదేశించింది. భీమిలి బీచ్​కు అతి సమీపంలో నిర్మాణాలు జరుగుతున్న అంశం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.