thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 10:14 PM IST

ETV Bharat / Videos

ఎన్నికల అధికారులతో సీఈవో సమీక్ష - లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల నిర్వహణపై చర్చ

AP CEO Mukesh Kumar Meena Review: ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎన్నికల సంసిద్ధతపై సమీక్షించారు. ఎన్నికల నిర్వహణ, ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించి అందే ఫిర్యాదులను పరిష్కరించే పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. 

తీసుకున్న చర్యలపై నివేదికను సంబంధిత పార్టీల ప్రతినిధులకు, ఫిర్యాదుదారునికి అందజేయాలని సూచించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చేయాల్సిన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణా నియంత్రణ అంశాలకు సంబంధించి సంబంధిత జిల్లాల ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించుకోవాలని జిల్లాల ఎన్నికల అధికారులకు సూచించారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టంయాప్ ఇప్పటికే సిద్ధంగా ఉందని, ఆ యాప్ ట్రయల్ రన్​ను మార్చి మొదటి వారంలో నిర్వహిస్తామన్నారు. ఈ లోపు ఆ యాప్​ను సంబందిత అధికారులు అందరూ డౌన్​లోడ్ చేసుకోవాలని, ఎన్ఫోర్సుమెంట్ అధికారులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్​లు, జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సభ్యులు అంతా లాగిన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.