పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్‌కు చర్యలు చేపట్టాలి: ముఖేష్ కుమార్ మీనా - Postal Ballot Home Voting - POSTAL BALLOT HOME VOTING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 9:31 PM IST
AP CEO Mukesh Kumar Meena Review: పోస్టల్ బ్యాలెట్‌తో పాటు హోం ఓటింగ్‌కు సంబంధించి చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశమైన మీనా, పోస్టల్ బ్యాలెట్లు, హోం ఓటింగ్‌కు సంబంధించి వివిధ సూచనలు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు జారీ చేయాల్సిన పోస్టల్ బ్యాలెట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
గతంలో పోస్టల్ బ్యాలెట్లపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయని, పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సీఈఓ సూచించారు. మరోవైపు 85 ఏళ్లు నిండిన ఓటర్లకు హోం ఓటింగ్ కల్పిస్తున్న దృష్ట్యా జారీ చేయాల్సిన ఫాంల విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా సూచనలు చేశారు. హోం ఓటింగ్ విషయంలో ప్రతి అంశాన్నీ పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని సీఈఓ స్పష్టం చేశారు. హోం ఓటింగ్‌కు సంబంధించి ఏప్రిల్, మే నెలల్లో తేదీల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలతో పాటు ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, పోలీసులు ఇతర సిబ్పందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాలు కల్పించే అంశం, ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాట్లపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు.