LIVE: ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా- మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం - CEO Mukesh Kumar Meena PRESS MEET - CEO MUKESH KUMAR MEENA PRESS MEET
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 1:19 PM IST
|Updated : May 7, 2024, 1:34 PM IST
AP CEO Mukesh Kumar Meena Media Conference Live: పోస్టల్ బ్యాలెట్ విషయంలో పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అందిన ఫిర్యాదులపై వేగవంతంగా స్పందిస్తున్నామని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ అందనివారి కోసం మరో రెండు రోజులు గడువు పెంచుతున్నామని వివరించారు. విజయనగరంలోని జేఎన్టీయూ- గురజాడ విశ్వవిద్యాలయంలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని మీనా సందర్శించారు.పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో ఏర్పాట్లు, సదుపాయల కల్పన, ఓటర్ల హాజరు తదితర విషయలపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ఇవాళ బ్యాలెట్ ఓటు అందడం, గెజిటెడ్ సంతకం తదితర విషయాలపై ఫిర్యాదులు వచ్చాయని మీనా తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఫెసిలిటేషన్ కేంద్రంల్లో సదుపాయాల కల్పనపై అనేత ఫిర్యాదులు అందాయని సీఈఓ మీనా తెలిపారు. ఈ రోజు, బ్యాలెట్ ఓటు అందటం గెజిటెడ్ సంతకం తదితర విషయాలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటన్నింటి దృష్ట్యా పోస్టల్ బ్యాలెట్ దాఖలు గడువుని మరో రెండు రోజులు పెంచుతున్నట్ల సీఈవో చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : May 7, 2024, 1:34 PM IST