చెత్త కొనుగోలుకు లంచం- ఏసీబీకి చిక్కిన ఏఈ - ACB Rides in Vijayawada
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 19, 2024, 1:20 PM IST
Anti Corruption Bureau Rides in Vijayawada Vehcle Depo : విజయవాడ నగరపాలక సంస్థ వెహికల్ డిపో ఇన్ఛార్జ్ ఏఈ ఈశ్వర్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. వెహికల్ డిపో ఈఈ కార్యాలయంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ ఏఈగా తోట ఈశ్వర్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు నగరపాలక సంస్థ నుంచి కొనుగోలు చేసే కాంట్రాక్టర్ (Contractor) షేక్ సద్దాం హుస్సేన్ నుంచి రూ. 50,000 డిమాండ్ చెయ్యగా, లంచం ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
పక్కా ప్రణాళికతో ఏసీబీ (Anti Corruption Bureau) డీఎస్పీ ఈశ్వర్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు ఉండగా దానికి సంబంధించిన వర్క్ ఆర్డర్ అగ్రిమెంట్ తయారు చేసే క్రమంలో ఏఈ ఈశ్వర్ లంచం అడిగినట్లు అధికారులు తెలిపారు. ఓ వార్డు సచివాలయ ఉద్యోగిగా ఉన్న ఈశ్వర్‌ను వెహికల్ డిపో (Vehcle Depo) ఉన్నతాధికారిగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ ఏఈ గా కొనసాగిస్తున్నారు.