మంగళగిరిలో స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తాం : కేశినేని శివనాథ్ - Kesineni on Cricket Matches - KESINENI ON CRICKET MATCHES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 12, 2024, 4:53 PM IST
Kesineni on Development of Cricket in AP : గుంటూరు జిల్లా మంగళగిరిలోని మైదానంలో త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. అలాగే అందులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సహకారంతో ఒక స్పోర్ట్స్ సెంటర్‌ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. విశాఖలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి తోడుగా మరొక మైదానాన్ని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేశినేని శివనాథ్ వివరించారు. మంగళగిరిలోని క్రికెట్ మైదానంలో మౌలిక వసతుల కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే దీనిని వినియోగంలోకి తీసుకువస్తామని చెప్పారు. అదేవిధంగా పాత 13 జిల్లా కేంద్రాల్లో ప్రతిచోట ఒక్కో క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకోసం కమిటీలు వేశామని వివరించారు. వారంతా త్వరితగతిన చర్యలు చేపడతారని కేశినేని శివనాథ్ వివరించారు.