వాహనానికి పోలీస్ సైరన్ - లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు - POLICE SIREN ON PRIVATE VEHICLES - POLICE SIREN ON PRIVATE VEHICLES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2024, 5:09 PM IST
Police Siren on Private Vehicles and Doing Thefts : ప్రైవేట్ వాహనానికి పోలీస్ సైరన్ ఏర్పాటు చేసుకొని వాహనదారులను బెదిరించి సొమ్ము చేసుకుంటున్న ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు, సెల్ ఫోన్లను లాక్కునే వ్యక్తులను జిల్లాలోని గుంతకల్లు పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. శుక్రవారం రాత్రి గుంతకల్లు పట్టణంలోని గుత్తి రోడ్డులో పోలీస్ సైరన్‌తో ఉన్న వాహనంలో వచ్చి లారీ డ్రైవర్, క్లీనర్‌ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు.
తమ దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో సెల్ ఫోన్లు లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు వాహనం నంబర్ చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాధితులను బెదిరించిన ముగ్గరు వ్యక్తులతో పాటు ఓ బొలేరో వాహనాన్ని గుత్తిలోని ఓ డాబా వద్ద ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రైవేట్ వాహనానికి ఏపీట్రాన్స్కో బోర్డు పెట్టుకుని ఈ తరహాలో దోపిడీలకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది.