వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ఉల్లంఘన - తండ్రికి అధికారులు కొమ్ము కాస్తున్నారని కొడుకు ఆగ్రహం - YCP Leaders Violated Election Code - YCP LEADERS VIOLATED ELECTION CODE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 9:17 AM IST

Anakapalli YSRCP MP Candidate Budi Mutyala Naidu Violated Election Code : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలోని ప్రభుత్వ భవనాలను అనకాపల్లి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు క్యాంప్ కార్యాలయంగా వినియోగించు కోవడంపై పలువురు వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు కోడ్ వచ్చి పది రోజులు దాటుతున్న ఎందుకు కలెక్టర్, ఇతర అధికారులు ఖాళీ చేయించలేదని ఆయన కుమారుడు బూడి రవికుమార్ ప్రశ్నించారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని భావన జనాలకు కలిగే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరరాపల్లిలో ఉన్న రైవాడ గెస్ట్ హౌస్​కి వేసిన అధికార పార్టీ రంగులు ఇప్పటికి తొలగించలేదని అన్నారు. 

మాడుగుల నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి లేదని, అభివృద్ధి అంటే యువతకి ఉపాధి కల్పించడం, పరిశ్రమలు ఏర్పాటు చేయడం బూడి రవికుమార్ అన్నారు. ఈ ఐదేళ్లలో మాడుగుల నియోజకవర్గంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయిందని ఆయన మండిపడ్డారు. వాకపల్లి, మారేపల్లి రెవిన్యూ పరిధిలోని 30 ఎకరాల దేవాదాయ శాఖ భూములు కబ్జా చేసినా కనీసం పట్టించుకోలేదన్నారు. ప్రజా సేవ చేయాలని ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు పేర్కొన్నారు. తన తాత బూడి వెంకి నాయుడు, తన తల్లి రవణమ్మ కొడుకుగా ప్రజా సేవ చేయడానికి ముందుకు వస్తున్నట్లు రవికుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.