మంత్రి అంబటి రాంబాబు, మోహిత్ రెడ్డి పిటిషన్లను డిస్మిస్ చేసిన హైకోర్టు - ambati rambabu petition dismissed - AMBATI RAMBABU PETITION DISMISSED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 23, 2024, 8:21 PM IST
Ambati Rambabu and Mohith Reddy Petitions Dismissed: రాష్ట్రంలో కొన్నిచోట్ల రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. రీపోలింగ్ జరపాలని కోరుతూ మంత్రి అంబటి రాంబాబు, చంద్రగిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి మోహిత్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన రెండు పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. పోలింగ్ రోజు హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని మంత్రి అంబటి ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
అదే విధంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో స్క్రూటినీ రీ షెడ్యూల్ చేయాలని, రీ పోలింగ్ జరిపించాలని వైఎస్సార్సీపీ (YSRCP) అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (Chevireddy Mohith Reddy) పిటిషన్ వేశారు. అయితే చంద్రగిరిలో రీపోలింగ్ నిర్వహించాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. రెండు పిటిషన్లనూ హైకోర్టు డిస్మిస్ చేసింది.