ఇక సీఎం జగన్​కు మిగిలింది 30 రోజులే: బాలకోటయ్య - ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 6:14 PM IST

Amaravati Bahujana JAC Chief Pothula Balakotaiah Call For Protest : రాష్ట్రంలో దళితుల ఆత్మ గౌరవం కోసం, రాజధాని అమరావతి కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం పని చేస్తామని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోతుల బాలుకోటయ్య అన్నారు. విజయవాడలో (Vijayawada) నిర్వహించిన మీడియా సమావేశంలో (Meeting) బాలకోటయ్య మాట్లాడుతూ రాజధాని కోసం భూములు ఇచ్చిన దళిత బహుజనులు వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వారికి న్యాయం జరగాలంటే రాజకీయ పార్టీలు బహుజనులకు చట్ట సభల్లో అవకాశం కల్పించాలన్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్​కు మిగిలింది 30 రోజులేనని స్పష్టం చేశారు.   

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును (Chandrababu Naidu) అన్యాయంగా జైలులో పెడితే మేము ఉద్యమాలు చేశామన్నారు. జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారాలంటే బహుజనులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. న్యాయంగా ఉద్యమ శక్తులకు అవకాశం ఇవ్వాలని మేము కోరుతున్నామని పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.