'అక్షయపాత్ర' ఆపన్నహస్తం - స్వచ్ఛందంగా తరలివచ్చిన డ్వాక్రా మహిళలు - AkshayaPatra Food for Flood Victims - AKSHAYAPATRA FOOD FOR FLOOD VICTIMS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 2:27 PM IST

Akshaya Patra Preparing Food for Flood Victims in Guntur District : ఆపత్కాలంలో ఉన్న విజయవాడ ప్రజల ఆకలి తీర్చేందుకు మనసున్న ప్రతి ఒక్కరూ అండగా నిలుస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని హరేరామ హరేకృష్ణ మూవ్​మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షయపాత్ర వంటశాల నుంచి రోజుకు దాదాపు 3 లక్షల మందికి మూడు పూటలా ఆహారం అందిస్తున్నారు. 

లక్షలాది మందికి సకాలంలో ఆహారం అందించేందుకు రాజధాని ప్రాంత వాసులు తమ వంతుగా ప్యాకింగ్ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అధికారుల సూచనల మేరకు డ్వాక్రా మహిళలు సైతం ఆహారం పంపిణీ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. మరికొందరు టీవీ, వాట్సప్​ గ్రూప్​లో చూసి వరద బాధితులకు సహాయం చేయడానికి స్వచ్ఛంద వచ్చినట్లు మహిళలు పేర్కొన్నారు. విజయవాడ వరద బాధితులకు తమ వంతుగా సహాయం చేస్తున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తోటి వారు ఆకలితో అలమటిస్తుంటే వారికి ఆహారం అందించడం మానవత్వం అంటున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు, చిలకలూరిపేట, తెనాలి, తాడేపల్లి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.