నేటి నుంచి విజయవాడ - హైదరాబాద్ ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు - vijayawada Air India Flight service - VIJAYAWADA AIR INDIA FLIGHT SERVICE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 1:59 PM IST
Air India Flight Services From Vijayawada– Hyderabad: ఈరోజు నుంచి విజయవాడ – హైదరాబాద్‌కు విమానాలు నడపడానికి మరో దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ముందుకొచ్చింది. విజయవాడ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ విమాన సర్వీసులు అందించనుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో విజయవాడ - హైదరాబాద్ మార్గంలో రెండు సర్వీసులు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది.
Air India Services: ఎయిరిండియా (Air India)ను కొనుగోలు చేసినప్పటి నుంచి దాని అభివృద్ధిలో భాగంగా టాటా గ్రూప్ (Tata Group) వివిధ మార్పులకు శ్రీకారం చుడుతోంది. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సమయంలో ఆధ్యాత్మిక నగరానికి దిల్లీ నుంచి విమాన సర్వీసులను గత సంవత్సరం డిసెంబర్లో ఎయిరిండియా (Air india) ప్రారంభించింది. ప్రయాణీకులకు ఆకర్షణీయమైన ఛార్జీలను ఎయిర్ ఇండియా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంది. నిర్దేశించిన అంతర్జాతీయ రూట్లలో కూడా ఇలాంటి ఆకర్షణీయమైన ఛార్జీలు అందుబాటులో ఉన్నాయని ఎయిర్‌లైన్స్ తెలిపింది.