ఇచ్చిన మాట నిలుపుకోవాలి - అగ్రిగోల్డ్ బాధితుల న్యాయపోరాట దీక్ష - Agrigold Protested in vijayawada
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 5:56 PM IST
Agrigold Victims at Dharnachowk in Vijayawada : అధికారంలోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా తమ సమస్యలను ఇంకా పరిష్కరించలేదని అగ్రిగోల్డ్ బాధితులు ధ్వజమెత్తారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద అగ్రిగోల్డ్ బాధితులు న్యాయపోరాట దీక్ష చేపట్టారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట తప్పను - మడమ తిప్పాను అని చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే మాట తప్పారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు చెల్లించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. వారం రోజులలోపు అగ్రిగోల్డ్ నిధులను కేటాయించి మాట నిలుపుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఇంతవరకు ఎలాంటి ఎంక్వయిరీ కూడా చేయించలేదని, అర్జీలపై అర్జీలు పెట్టిన ఎలాంటి ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. తూతూమంత్రంగా రూ.900 కోట్ల ఇచ్చి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన బాధితులకు రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తానన్న హామీ నెరవేర్చాలని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకపోతే రానున్న ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు.