తిరుమల బ్రహ్మోత్సవాలపై అదనపు ఈఓ సమీక్ష- ప్రత్యేక దర్శనాలు రద్దు - Brahmotsavam Arrangements Review - BRAHMOTSAVAM ARRANGEMENTS REVIEW
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 4, 2024, 12:32 PM IST
Additional EO Review With Tirumala Brahmotsavam Arrangements: తిరుమల బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అదనపు ఈఓ వెంకయ్య చౌదరి సమీక్ష చేశారు. ఇంజినీరింగ్ పనులు, వాహనాల ఫిట్‌నెస్, లడ్డూల బఫర్ స్టాక్, అన్నప్రసాదం, దర్శనం, వసతి, కళా బృందాల కార్యక్రమాలు, ఉద్యానవన శాఖ, రవాణా, కళ్యాణ కట్ట, గోశాల, శ్రీవారి సేవకులు, విజిలెన్స్ విభాగం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని వెంకయ్య చౌదరి ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆయన నిర్దేశించారు.
అక్టోబర్ 4న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 8న గరుడ సేవ, 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్ర స్నానంతో ముగుస్తాయి. వాహన సేవలు ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7గంటలకు ప్రారంభమవుతాయి. సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అక్టోబరు 7న రాత్రి 11 గంటల నుంచి అక్టోబరు 8 అర్ధరాత్రి వరకు ద్విచక్రవాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, ఎన్నారైలు సహా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.