ధర్మవరంలో దారుణం- పరీక్షలు రాయమన్నందుకు ఐదో తరగతి విద్యార్థి ఆత్మహత్య - 5th Class Student Suicide - 5TH CLASS STUDENT SUICIDE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 13, 2024, 4:15 PM IST
5th Class Student Suicide In Satyasai District : పదకొండేళ్ల వయసు పిల్లవాడు. కనీసం అమ్మ అన్నం పెట్టి కంచం చేతికిస్తేగానీ వడ్డించుకోవడం తెలియని పసివాడు తన ఉసురు తీసుకున్నాడు. కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లి గుండెకోత వర్ణనాతీతం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన నాగచైతన్య అనే ఐదో తరగతి విద్యార్థి ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో నాగచైతన్య ఐదో తరగతి చదువుతున్నాడు.
గత రెండు రోజులుగా అతడు పాఠశాలకు వెళ్లకపోవడంతో పరీక్షల సమయంలో పాఠశాలకు వెళ్లాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని నాగచైతన్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో నాగచైతన్య తల్లిదండ్రులు శ్రీదేవి రంగప్ప బోరున విలపించారు. ధర్మవరం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.