సీఎం సొంత ఇలాకాలో వైఎస్సార్సీపీకి షాక్ - టీడీపీలో చేరిన 200 కుటుంబాలు - వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 9:59 AM IST
200 Families Joined in TDP at YSR District : వైయస్సార్ జిల్లా కమలాపురంలో నానాటికీ వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు పెరుగుతూనే ఉన్నాయి. చెన్నూరు మండలం కొండపేటలో 200 కుటుంబాలు వైఎస్సార్సీపీని (YSRCP) వీడి టీడీపీ (TDP) కండువా కప్పుకున్నాయి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా నిర్వహించిన ప్రచారంలో వారు వైఎస్సార్సీపీని వీడి టీడీపీకి చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ (MLC) రామచంద్రయ్య, ఇతర తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు.
YCP Members Joined in TDP At Kadapa District : ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. ఇప్పుడున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతంలో టీడీపీ ఇచ్చే పథకాల పేర్లు మాత్రమే మార్చుకున్నారని తెలిపారు. జగన్ (Jagan) పథకాల పేరుతో అధికారంలోకి వచ్చి అడ్డగోలు ఆంక్షలతో ప్రజలకు పథకాల్లో కోతలు కోశారని ఆరోపించారు. అర్హులైన వారికి పథకాలు ఇవ్వడం లేదని మండిరడ్డారు.