TVS Apache RR 310 Launched: వాహన ప్రియులకు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ శుభవార్త తెచ్చింది. తన రేసింగ్ బైక్ 2024 అపాచీ ఆర్ఆర్ 310 బైకును ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ లేటెస్ట్ మోడల్లో వింగ్లెట్స్తో సహా అనేక కొత్త ఫీచర్లను పొందుపర్చారు. కొత్త వింగ్లెట్స్ సుమారు 3 కిలోల డౌన్ ఫోర్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది మెరుగైన పెర్పార్మెన్స్కు దోహదపడుతుంది. నావిగేషన్ తో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది.
ఈ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 మోటార్ సైకిల్ మొత్తం డిజైన్‌లో పెద్దగా మార్పులేవీ చేయలేదు. అయితే రేసింగ్ బైక్ రైడర్స్ సౌలభ్యం కోసం TVS కొన్ని అదనపు ఫీచర్లను అందించింది. కస్టమర్లు ప్రత్యేక సస్పెన్షన్, టైర్ ప్రెజర్ గేజ్, బ్రష్ చైన్‌లను ఉపయోగించవచ్చు. అయితే వాటికి 18,000 రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు వినియోగదారులు రూ. 16,000 ఖర్చు చేయడం ద్వారా మరిన్ని ఫీచర్లను పొందొచ్చు. వీటి బుకింగ్స్ TVS ప్రీమియం డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈ కొత్త రేసింగ్ బైక్ ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు మీకోసం.
2024 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 స్పెసిఫికేషన్స్:
- ఇంజిన్: 312 cc సింగిల్-సిలిండర్
- టార్క్: 7,900 rpm వద్ద 29 Nm పీక్
- పవర్: 38 bhp
- 6-స్పీడ్ గేర్‌బాక్స్
- డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్
- టిఎఫ్‌టి డిస్‌ప్లే
- ఆల్-ఎల్‌ఇడి లైటింగ్
- మల్టిపుల్ రైడ్ మోడ్‌లు
- టర్న్-బై-టర్న్ నావిగేషన్
- బ్లూటూత్ కనెక్టివిటీ
2024 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 వేరియంట్స్: కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది.
- రేసింగ్ రెడ్ వేరియంట్
- బాంబే గ్రే రేసింగ్ రెడ్ వేరియంట్
2024 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 ధరలు:
- రేసింగ్ రెడ్ వేరియంట్ ధర: రూ. 2.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- బాంబర్ గ్రే వేరియంట్ ధర: రూ.2.97 లక్షలు (ఎక్స్-షోరూమ్)
మార్కెట్లో వీటికి పోటీ: 2024 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 స్పోర్ట్‌బైక్ సెగ్మెంట్‌లోని KTM RC 390, అప్రిలియా RS 457 వంటి వాటితో సులభంగా పోటీపడగలదు.