ETV Bharat / state

అక్రమ నిర్మాణాలను అడ్డుకోని అధికారులు - కనీసం నోటీసు ఇచ్చే ప్రయత్నమూ చేయని వైనం - YSRCP Offices Construction in AP

YSRCP Offices Construction in Andhra Pradesh: ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ సేవలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తరించారు. అక్రమంగా అనుమతులు లేకుండా పార్టీ భవనాలు కడుతున్నా కనీసం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ నేతలతో అంటకాగిన పలువురు అధికారులు కనీసం అక్రమ కట్టడాలకు నోటీసులు ఇచ్చే ప్రయత్నమూ చేయలేదు. వీరి తీరుతో నగరపాలక సంస్థలు ఫీజుల కింద కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయాయి.

YSRCP Offices Construction
YSRCP Offices Construction (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 24, 2024, 7:33 AM IST

YSRCP Offices Construction in Andhra Pradesh: సామాన్యుడు తన సొంత స్థలంలో చిన్నపాటి షెడ్డు వేసుకుంటే నగరపాలక, పురపాలక సంస్థల్లోని పట్టణ ప్రణాళిక విభాగాలకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు వెంటనే వాలిపోతారు. అనుమతులు తీసుకోకుండా పనులెలా చేస్తారంటూ నానా గొడవ చేస్తారు. కట్టడాన్ని కూల్చేస్తామంటారు. ఇలా విధుల పట్ల ఎంతో అంకితభావం ప్రదర్శించే అధికారులకు ఐదేళ్లుగా రాజప్రాసాదాల మాదిరిగా నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయాల భవనాలు కనిపించలేదు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న 26 భవనాల్లో ఒక్కటి తప్ప, మిగతా 25 చోట్ల అనుమతులే లేవు.

వైఎస్సార్సీపీ నేతల సేవలో తరిస్తూ: వీటిలో ఏడు చోట్ల ఇప్పటికే భవన నిర్మాణాలు పూర్తవగా, మరో 2 తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. అడ్డగోలుగా చేపట్టిన ఈ భవనాల నిర్మాణ పనులను అడ్డుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారన్నది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అక్రమ నిర్మాణాలను అడ్డుకోని కారణంగా నగరపాలక సంస్థలు ఫీజుల కింద కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయాయి. కొన్నిచోట్ల నోటీసులిచ్చి చేతులు దులిపేసుకున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, మచిలీపట్నం, కర్నూలు, కడప ఇలా అనేకచోట్ల గత ఐదేళ్లూ వైఎస్సార్సీపీ నేతల సేవలో పట్టణ ప్రణాళిక అధికారులు తరిస్తూ, అక్రమ నిర్మాణాలను గాలికి వదిలేశారు.

రాష్ట్రమంతటా వైఎస్సార్సీపీ రాజమహళ్లు- నామమాత్రపు లీజుతో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ - YSRCP District Offices Construction

అధికారులు ప్రేక్షకపాత్ర: కర్నూలులో అనుమతులు తీసుకోకుండానే ఏడాది కాలంగా వైఎస్సార్సీపీ కార్యాలయ భవన నిర్మాణ పనులు చేస్తున్నా పట్టణ ప్రణాళిక అధికారులు కన్నెత్తి చూడలేదు. కనీసం నోటీసు ఇవ్వలేదంటే ఆ పార్టీ నేతలతో వీరు ఎంతగా అంటకాగారో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక భవన నిర్మాణ పనులకు ఫీజుల కింద నగరపాలక సంస్థకు వైఎస్సార్సీపీ నేతలతో 14లక్షల 25 వేల రూపాయలు కట్టించారు. విశాఖలోని ఎండాడలో రెండెకరాల స్థలంలో రెండంతస్థుల వైఎస్సార్సీపీ కార్యాలయ భవన నిర్మాణ పనులకు అనుమతులు లేకున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు.

ప్రభుత్వం మారడంతో హడావుడిగా నోటీసులు: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకే నోటీసులిచ్చారు. భవన నిర్మాణానికి జీవీఎంసీ నుంచి అనుమతి తీసుకోవలసి ఉంది. వైఎస్సార్సీపీ నేతలు తెలివిగా సంబంధం లేని విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి దరఖాస్తు చేశారు. అది కూడా ఒక ఫ్లోర్‌ పనులు పూర్తయ్యాక, అదీ 4 రోజుల కింద దరఖాస్తు చేయడం విశేషం. అనకాపల్లి జిల్లా కొత్తూరు నర్సింగరావుపేటలో 1.75 ఎకరాల్లో అనుమతులు లేకుండానే వైఎస్సార్సీపీ కార్యాలయం భవన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి చేశారు. ఇంత జరిగినా పట్టణ ప్రణాళిక అధికారులు స్పందించ లేదు. ఈ భవనంలో ఇంటీరియర్‌ పనులే మిగిలాయి. ప్రభుత్వం మారడంతో మేల్కొని శనివారం హడావుడిగా భవనానికి నోటీసులు అంటించారు.

మచిలీపట్నంలో అనుమతులు తీసుకోకపోయినా భవనం పనులు పూర్తయ్యాయి. అధికారులు ఈ విషయంలో అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు. అనుమతి తీసుకోకుండా రోడ్డు పక్కన జనసేన జెండా దిమ్మలు పెడితే తొలగించిన అధికారులు, వైఎస్సార్సీపీ భవన నిర్మాణ పనులను మాత్రం పట్టించుకోలేదు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జలవనరుల శాఖకు చెందిన బోట్‌యార్డు స్థలంలో నిర్మిస్తున్న భవనం విషయంలోనూ ఎన్నికల ఫలితాలొచ్చే వరకు ఉదాసీనంగానే వ్యవహరించారు. ఆ తరువాతే జోరు పెంచారు.

మనకెందుకు అనుమతులు అనుకున్నారేమో- అక్రమనిర్మాణాలపై వైఎస్సార్​సీపీకి నోటీసులు - GVMC Notices to YSRCP Office

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.